Disha: ప్రియాంక హత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

షార్ట్స్‌లో చూడండి
ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ (తహసీల్దార్) 14 రోజుల రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని పోలీసులు భావించారు. దీంతో, మేజిస్ట్రేట్ ను పోలీస్ స్టేషన్ కే తీసుకొచ్చారు.

కేసును విచారించిన మేజిస్ట్రేట్ నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. నిందితులకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, వారిని మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.
Go Back to Shorts
Disha
Murder

More Telugu News