Disha: అందరూ సంయమనం పాటించండి.. వారికి ఉరిశిక్ష పడేలా చేస్తాం: పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
ప్రియాంక హత్య కేసు నిందితులు ఉన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుర్మార్గులను తక్షణమే ఉరి తీయాలంటూ వందలాది మంది విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు, స్థానికులు పీఎస్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోకి దూసుకుపోయేందుకు వారు యత్నించడంతో... పోలీసులు ఓ మోస్తరు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా అక్కడున్న అందరికీ పోలీసులు ఓ విన్నపం చేశారు. అందరూ సంయమనం పాటించాలని విన్నవించారు. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని తెలిపారు.
Go Back to Shorts
Disha
Murder

More Telugu News