మీరు పెంచాల్సింది కండలు కాదు: కుర్ర హీరోలకు రిషికపూర్ సలహా
- కుర్ర హీరోలు బుర్రలు పెంచాలి
- నటులకు కావాల్సింది ఎమోషనల్ వ్యాయామం
- సిక్స్ ప్యాక్ బాడీ లేకున్నా.. ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నా
ఆలోచనా సామర్థ్యం ఎక్కువగా ఉంటే నటించే నైపుణ్యం మెరుగు పడుతుందని, మంచి కాన్సెప్ట్ ను ఎంచుకునే సామర్థ్యం కూడా వస్తుందని రిషికపూర్ చెప్పారు. ఈ సామర్థ్యం లేకపోతే వేరొకరు వచ్చి వారి స్థానాలను భర్తీ చేస్తారని తెలిపారు. తననే ఉదాహరణగా తీసుకోవాలని... తనకు సిక్స్ ప్యాక్ బాడీ లేకున్నా... ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ ను తానే క్రియేట్ చేస్తానని తెలిపారు.
అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి అడుగు పెట్టే సమయంలో చాలా సన్నగా ఉండేవాడని, ఇప్పటికీ అలాగే ఉన్నాడని, ఈ వయసులో కూడా ఆయనను యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పిలుస్తారని చెప్పారు. రణవీర్ సింగ్, రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్, రణబీర్ కపూర్ లకు కండలు తిరిగిన బాడీ లేకపోయినా, వారికున్న టాలెంట్ తో సత్తా చాటుతున్నారని తెలిపారు.