వైద్యురాలి హత్యాచార ఘటనలో గగుర్పొడిచే మరిన్ని విషయాలు బయటకు!
- ప్రతిఘటించకుండా ఉండేందుకు నోట్లో మద్యం
- 45 నిమిషాల పాటు కిరాతకం
- మృతదేహంపైనా పలుమార్లు అత్యాచారం
అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితురాలు ప్రతిఘటించకుండా ఉండేందుకు బలవంతంగా ఆమె నోరు తెరిచి మద్యం పోశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసిన నిందితులు ఆ తర్వాత ముక్కు, నోరు మూయడంతో ప్రాణాలు కోల్పోయింది.
అంతేకాదు, పోలీసులు వెల్లడించిన మరో విషయం గగుర్పాటుకు గురిచేస్తోంది. మృతదేహాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలోనూ పలుమార్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని లారీలోకి ఎక్కించే క్రమంలో ప్యాంటు లేదని, ఆ తర్వాత ఓ నిందితుడు కిందికెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.