బీజేపీకి 'యూరి' డైలాగ్ తో సెటైర్ వేసిన శివసేన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీకి 'యూరి' డైలాగ్ తో సెటైర్ వేసిన శివసేన!

  • నేడు కొలువుదీరనున్న సంకీర్ణ ప్రభుత్వం
  • ట్విట్టర్ వేదికగా ఎలావుందని సంజయ్ రౌత్ ప్రశ్న
  • వైరల్ అవుతున్న ట్వీట్
సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారంగా తెరకెక్కి, ఆ మధ్య విడుదలై సూపర్ హిట్ అయిన 'యూరి' చిత్రం గుర్తుందా? ఇందులోని 'హౌ ఈజ్ జోష్' అన్న డైలాగ్ ఎంతో పాప్యులర్ అయింది. ఇక ఇదే డైలాగ్ ను శివసేన నేత సంజయ్ రౌత్, తాజాగా బీజేపీపై సెటైర్ వేసేందుకు ప్రయత్నించారు. నేటి సాయంత్రం శివసేన నేతృత్వంలో కాంగ్రెస్ - ఎన్సీపీలు మద్దతిస్తున్న సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన సంజయ్ రౌత్, "హౌ ఈజ్ జోష్" అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Sanjay Rout
Twitter
URI

More Telugu News