బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు!
- సిద్ధిపేట సమీపంలో ఘటన
- కారులో కుటుంబీకులతో వెళుతున్న సంపూర్ణేశ్
- త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. సంపూర్ణేశ్ ముఖానికి, చేతులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన భార్య, కుమార్తె కూడా గాయపడ్డారు. వీరిని చూసి స్పందించిన స్థానికులు, సమీపంలోని ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.