తేజకు బంపరాఫర్... అమితాబ్ తో సినిమా చేసే చాన్స్!

టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తేజ, ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 'ఆర్టికల్ 370' కథాంశంగా తేజ, ఓ స్టోరీని సిద్ధం చేయగా, ఇందులో నటించేందుకు అమితాబ్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గోవాలో మొదలయ్యాయని, ఓ ప్రముఖ నిర్మాత దీన్ని నిర్మిస్తున్నారని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
Go Back to Shorts
Amitabh Bachchan
Teja
Article 370
Movie

More Telugu News