Rayalaseema: రాయలసీమలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో రాయలసీమ ప్రాంతంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ వివరాలను తెలియజేస్తూ పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 1వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన ఖరారైనట్టు తెలిపారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల్లో ఆయా సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారని అన్నారు.

పవన్ కల్యాణ్ పర్యటన వివరాలు..

-1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు, మూడు గంటలకు రైల్వే కోడూరు చేరుకుని జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు.

- 2వ తేదీ ఉదయం పది గంటలకు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం

- 3వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష

- 4వ తేదీన మదనపల్లె చేరుకుంటారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం

- 5వ తేదీన అనంతపురం జిల్లా నేతలతో సమీక్షా సమావేశం. అనంతరం, స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చ

- 6వ తేదీన పార్టీ కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడంతో ఇబ్బంది పడుతున్న వారికి పవన్ భరోసా కల్పించనున్నారు.
Go Back to Shorts
Rayalaseema
Janasena
Pawan Kalyan

More Telugu News