ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు అమ్ముకోవడానికే సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు: మంద కృష్ణ
- 52వ రోజుకు చేరిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె
- కోదాడలో సేవ్ ఆర్టీసీ నిరసన కార్యక్రమం
- హాజరైన మంద కృష్ణ
కోదాడలో ఇవాళ నిర్వహించిన సేవ్ ఆర్టీసీ నిరసన కార్యక్రమానికి మంద కృష్ణ కూడా హాజరయ్యారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధి కల్పన చేయకపోగా, 50 వేల మంది ఉద్యోగులను తొలగించడం ద్వారా వాళ్ల కుటుంబాలను వీధిన పడేశారని ఆరోపించారు. ఈ పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.