మీ భాష, మీ యాసలో మాట్లాడండి.. మాతృభాషలపై మోదీ కీలక ప్రసంగం
- ‘మన్ కీ బాత్’లో మాతృభాషల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పిన ప్రధాని
- అమ్మ భాషతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ
- రంగ్ జాతి ప్రజలు అందరికీ ఆదర్శం కావాలి
ఉత్తరాఖండ్‌లోని దారుచులా ప్రాంతంలో రంగ్ జాతి ప్రజలు లిపి లేని తమ భాష ‘రంగ్లో’ను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. పదివేల వరకు ఉండే ఆ జాతి ప్రజలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ భాషాభివృద్ధికి పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఇది అందరికీ స్ఫూర్తి కావాలని, ఎవరి భాషను వారు, వారి యాసతో ఉపయోగించడం ప్రారంభించాలని మోదీ సూచించారు. ఎంత అభివృద్ధిని సాధించినా మాతృభాషను విస్మరిస్తే దానికి అర్థం ఉండదని మోదీ పేర్కొన్నారు.