Congo: కాంగోలో ఘోర విమాన ప్రమాదం... అందరూ మృతి

షార్ట్స్‌లో చూడండి
ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. గోమా నుంచి బెనీ వెళుతున్న డోర్నియర్ విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపంతో అదుపుతప్పిన ఈ విమానం జనావాసాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది, 17 మంది ప్రయాణికులు మొత్తం మరణించారు. ఇప్పటివరకు 6 మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Congo
Plane Crash
Africa

More Telugu News