తెలంగాణలో 51వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె... అడుగు ముందుకే అంటున్న అశ్వత్థామరెడ్డి
- సమ్మె యధాతథం అంటున్న ఆర్టీసీ జేఏసీ
- ఎంజీబీఎస్ లో జేఏసీ సమావేశం
- డిపోలు, కూడళ్ల వద్ద కార్యక్రమాలు
ఇవాళ హైదరాబాద్ ఎంజీబీఎస్ లో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. నేడు అన్ని డిపోల్లో తలపెట్టిన మానవహారాలు, మౌనదీక్షలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ఇకపైన కూడా తమ కార్యాచరణ కొనసాగుతుందని, డిపోలు, కూడళ్ల వద్ద కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.