Rajamouli: 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' సినిమా ట్రైలర్ పై రాజమౌళి స్పందన

షార్ట్స్‌లో చూడండి
హాస్యనటుడిగా అలరించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడు  దర్శకుడు, నిర్మాతగా మారి ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా తీస్తున్నారు. శ్రీనివాసరెడ్డి  కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో సత్య, షకలక శంకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వరుణ్‌తేజ్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ ట్రైలర్ పై దర్శకుడు రాజమౌళి స్పందించారు. 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా ట్రైలర్ ఇదిగో.. నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు శ్రీనివాస్ రెడ్డి మంచి కమెడియన్ గా తెలుసు. దర్శకుడు, నిర్మాతగానూ ప్రయాణం మొదలుపెట్టిన ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను' అని ట్వీట్ చేశారు.
   కాగా, డిసెంబర్‌ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.  సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు.
Go Back to Shorts
Rajamouli
Tollywood
trailer

More Telugu News