కాకినాడ సమీపంలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. 25 మంది గాయాలు
- తిమ్మాపురం-అచ్చంపేట క్రాస్‌రోడ్డు వద్ద ఘటన
- లారీ ఢీకొట్టడంతో బోల్తాపడి ముందుకు దూసుకెళ్లిన బస్సు
- పరారీలో లారీ డ్రైవర్
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.