భారీ లాభాల్లో రిలయన్స్... సరికొత్త రికార్డుకు స్టాక్ మార్కెట్!
- 4 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్ ఈక్విటీ
- 300 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- నష్టపోయిన పవర్ సెక్టార్
ఈ మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 300 పాయింట్లు లాభపడి 40,769 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 83 పాయింట్లు పెరిగి 12,023 పాయింట్ల వద్దా నడుస్తున్నాయి. బీఎస్ఈలో ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, టెలికం, ఇండస్ట్రియల్స్, హెల్త్ కేర్, ఆటో, బ్యాంకెక్స్, కాపిటల్ గూడ్స్ సెక్టార్లు లాభాల్లో నడుస్తున్నాయి. పవర్ సెక్టార్ కంపెనీలు మాత్రం నష్టపోయాయి.