Jagan: వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తుంటే.. ఎమ్మెల్యేలు నెక్స్ట్ సీఎం ఎవరని చర్చించుకుంటున్నారు: దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే పడవ వంటిదని అన్నారు. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు తదుపరి ముఖ్యమంత్రి ఎవరని చర్చించుకుంటున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు. అన్ని శాఖల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు.

గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించిన జగన్... సొంత పార్టీ ఎంపీలపై ఇంత త్వరగా పట్టును ఎందుకు కోల్పోతున్నారని అన్నారు. ఇదే విషయంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని చెప్పారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Devineni Uma
Telugudesam

More Telugu News