ఈ బర్గర్ తింటే పాతికవేలు ఇస్తారు... షరతులు వర్తిస్తాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ బర్గర్ తింటే పాతికవేలు ఇస్తారు... షరతులు వర్తిస్తాయి!

  • 9 నిమిషాల్లో బర్గర్ తింటే క్యాష్ ప్రైజ్
  • బర్గర్ బరువు 6 కిలోలు
  • తినలేక గుడ్లు తేలేస్తున్న జనాలు
పర్యాటకులకు స్వర్గధామం అంటే థాయ్ లాండ్ అనే చెప్పాలి. ఇక్కడి బీచ్ లు, సుందరమైన ద్వీపాలు, ముఖ్యంగా థాయ్ నైట్ లైఫ్ ప్రపంచ దేశాల ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ఇక, అసలు విషయానికొస్తే, థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ అనే రెస్టారెంట్ తిండి పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో భాగంగా ఓ బర్గర్ ను కేవలం 9 నిమిషాల్లో హాంఫట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో బర్గర్ లాగించినవారికి రూ.25 వేలు ఇస్తారు.

విషయం ఏంటంటే, ఈ బర్గర్ అలాంటిఇలాంటిది కాదు. దీని బరువు 6 కిలోలు. థాయ్ లో రూపొందించే బర్గర్లన్నింటికి ఇదే పెద్దన్న! మరి దీన్ని 9 నిమిషాల్లో తినడం అంటే మామూలు విషయం కాదు. అందుకే క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ వారు ఎంతో ధీమాగా ఈ పోటీ పెట్టారు. ఇప్పటివరకు ఈ బర్గర్ ను తినేందుకు వచ్చినవాళ్లు 15 నిమిషాల వరకు టైమ్ తీసుకుంటున్నారట! దాంతో ఎవరూ కూడా పాతికవేల క్యాష్ ప్రైజ్ నెగ్గలేకపోయారు.




Thailand
Burger
Chris Steaks And Burger

More Telugu News