కిటకిటలాడుతున్న తిరుమల గిరులు!

  • వారాంతం కావడంతో పెరిగిన రద్దీ
  • 23 కంపార్టుమెంట్లలో భక్తులు
  • అన్నపానీయాలు అందిస్తున్నామన్న టీటీడీ
వారాంతంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిశాయి. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా, స్వామి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వ్యాఖ్యానించారు. నిన్న శనివారం నాడు స్వామిని 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 2.50 కోట్లుగా నమోదైంది. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులకు అన్న పానీయాలను అందిస్తున్నామని టీటీడీ పేర్కొంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
Piligrims

More Telugu News