‘నిత్య కల్యాణం’ దోమ లాంటోడట!: పవన్ కల్యాణ్ పై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
Add ap7am to your home Screen

‘నిత్య కల్యాణం’ దోమ లాంటోడట!: పవన్ కల్యాణ్ పై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

  • సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట
  • ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే 
  • చంద్రబాబు కూడా ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. '‘నిత్య కల్యాణం’ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే... సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే' అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేసిన ఇసుక దీక్షపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ... 'ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరవు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదు' అని ట్వీట్ చేశారు.
Chandrababu
Pawan Kalyan
Vijay Sai Reddy

More Telugu News