Geeta Mali:  రోడ్డు ప్రమాదంలో మరాఠీ సినీ గాయని గీతా మాలి దుర్మరణం!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ మరాఠీ సినీ గాయని గీతా మాలి రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. ముంబై-ఆగ్రా హైవేలో జరిగిన యాక్సిడెంట్ లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే, తన భర్త విజయ్ తో కలిసి గీతా మాలి అమెరికా వెళ్లారు. రెండు నెలల టూర్ తర్వాత వారు ఇండియాకు తిరిగి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే... ఓ సెల్ఫీని ఫేస్ బుక్ లో గీత షేర్ చేశారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ తమ సొంత ఊరైన నాసిక్ కు ముంబై-ఆగ్రా హైవేపై బయల్దేరారు.

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కంటెయినర్ ను వారు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ హుటాహుటిన సమీపంలో ఉన్న షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గీత మృతి చెందారు. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరాఠీ సినిమాల్లో ఎన్నో పాటలను పాడిన గీత... సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్ లను కూడా రూపొందించారు.
ముంబై విమానాశ్రయంలో భర్తతో కలిసి గీత చివరి సెల్ఫీ
Go Back to Shorts
Geeta Mali
Singer
Marathi Films
Accident

More Telugu News