తమ్ముడిని చంపి జైలుకెళ్లిన అన్న... బీజేపీ, కాంగ్రెస్ తరఫున ఇద్దరి భార్యలూ అసెంబ్లీకి పోటీ!
- ఈ సంవత్సరం జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు
- తోడికోడళ్లకు టిక్కెట్లు ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్
- ఝరియాలో ఆసక్తికరంగా మారిన పోరు
ధన్ బాద్ జిల్లా ఝరియాకు చెందిన సంజీవ్ సింగ్, నీరజ్ సింగ్‌లు వరుసకు అన్నదమ్ములు అవుతారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన సంజీవ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నీరజ్ సింగ్ ను 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఓటమిని చాలెంజ్ గా తీసుకున్న నీరజ్, సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజాభిమానాన్ని పొందాడు. తమ్ముడికి ప్రజల్లో అభిమానం పెరుగుతోందని రగిలిపోయిన సంజీవ్ సింగ్, 2017 మార్చిలో తమ్ముడైన నీరజ్ సింగ్ ను హత్య చేయించాడు. ఆపై కేసు విచారణలో భాగంగా జైలులో ఉన్నారు.
ఈ సంవత్సరం జార్ఖండ్ కు ఎన్నికలు జరుగనుండగా, నీరజ్ సింగ్ భార్య పూర్ణిమా సింగ్ కాంగ్రెస్ అభ్యర్థినిగా ప్రకటించగా, జైలులో ఉన్న సంజీవ్ సింగ్ భార్య రాగిణీ సింగ్ ను బీజేపీ ఎంచుకుంది. దీంతో తోడికోడళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.