మస్కట్‌లో విషాదం.. భూగర్భంలో చిక్కుకుని ఆరుగురు భారత కార్మికుల మృతి
- నీటి పారుదల ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు
- భారీ వర్షాలకు భూగర్భంలో చిక్కుకున్న కార్మికులు
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాయబార కార్యాలయం
కార్మికుల మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్న అధికారులు, మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.