నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికిన హీరోయిన్ యామీ గౌతమ్!
- హిమాచల్ లో ఇన్వెస్టర్స్ మీట్
- కార్యక్రమానికి ప్రచారకర్తగా యామీ గౌతమ్
- సీఎంతో కలిసి మోదీకి స్వాగతం
మోదీకి వెల్ కమ్ చెప్పేందుకు హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ తో కలిసి ఎయిర్ పోర్టుకు వచ్చిన యామీ, ఆ చిత్రాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఓ గొప్ప కార్యక్రమానికి ప్రధాని మోదీ రావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తో కలిసి తాను మోదీని స్వాగతించానని తెలిపింది. హిమాచల్ కు పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపింది.