Andhra Pradesh: ఏపీలో వాగులోకి దూసుకుపోయిన బస్సు
ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు కాలువలోకి దూసుకుపోయి ఒక పక్కకు ఒరిగిపోయి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు బయటకు రావడానికి స్థానికులు సహాయం చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.