డేరాబాబా ఆశ్రమానికి వచ్చిన హనీప్రీత్ సింగ్
- బెయిల్ పై నిన్న విడుదలైన హనీప్రీత్
- నిన్న అర్ధరాత్రి డేరాసచ్చాసౌదాకు చేరుకున్న హనీప్రీత్
- ఘన స్వాగతం పలికిన వేలాది మంది భక్తులు
బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె నిన్న అర్ధరాత్రి నేరుగా సిర్సాలోని డేరాసచ్చాసౌదాకు వచ్చారు. ఈ సందర్భంగా డేరాలో వేచి చూస్తున్న వేలాది మంది భక్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు, ఈ సందర్భంగా తన కోసం వేచి చూస్తున్న మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. మీడియాతో మాట్లాడకుండానే రామ్ రహీం నివాసం ఉండే క్వార్టర్ కు కారులో వెళ్లిపోయారు.