Tirupati: 'మన స్నేహానికి గుర్తుగా నా ఆత్మహత్య'... తిరుపతిలో కలకలం రేపిన సూసైడ్!

షార్ట్స్‌లో చూడండి
చేసిన చిన్న పొరపాటు కారణంగా ప్రాణ స్నేహితుడు తనను దూరం పెట్టాడన్న మనస్తాపంతో, ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాలలో వేణుగోపాల్ అనే యువకుడు బీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతూ, హాస్టల్ లో ఉంటున్నాడు. నిన్న బాత్ రూమ్ కు వెళ్లిన వేణుగోపాల్, తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆపై బాధతో కేకలు పెడుతూ బయటకు పరుగు తీశాడు. దీన్ని చూసిన విద్యార్థులు 108కు సమాచారం అందించి, ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వేణుగోపాల్ మరణించాడు.

తాను చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసిన వేణుగోపాల్, స్నేహితునితో విభేదాలు రావడం, ఆపై తాను పడ్డ మానసిక వేదనను వివరించాడు. తొందరపాటులో తానో చిన్న తప్పు చేయగా, ప్రాణ మిత్రుడు దూరం పెట్టాడని, తానిప్పుడు నరకయాతన అనుభవిస్తున్నానని అన్నాడు. తన స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నానని, తనను క్షమించాలని వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Tirupati
Sucide
Student
Friend

More Telugu News