స.హ కమిషనర్ల నియామకంలో అలసత్వంపై కేంద్రం సహా 9 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
- జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- పదవులు ఖాళీ కావడానికి ముందే నియామకాలు చేపట్టాలి
- తాజా పరిస్థితిపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించమని ఆదేశం
అంతకుముందు పిటిషన్ దారు తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాల ప్రకారం కమిషనర్ పదవులకు ఎంపికచేసిన వారి పేర్లను వెబ్ సైట్లో పెట్టలేదని, కొన్ని రాష్ట్రాలు కూడా కమిషనర్లను నియమించలేదని తెలిపారు. సీఐసీ నియామకం కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎంపికలో అనుసరించిన పద్ధతిని పాటించాలన్న సుప్రీంకోర్టు సూచనను కేంద్రం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. కమిషనర్ల నియామకంలో మంచి రికార్డున్న అధికారులు, పలు రంగాల్లో పేరుగాంచిన ప్రముఖులను తీసుకోవాల్సి ఉండగా కొన్ని రాష్ట్రాలు కేవలం అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి 6 నెలలు గడువు విధించినా రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.