ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ ప్రభుత్వం తక్షణం చర్చలు జరపాలి: ఎంపీ బండి సంజయ్
- గడువు విధించినా కార్మికులు పట్టించుకోలేదు
- ఇక చర్చలు జరిపి ప్రభుత్వం బాధ్యతగా వ్యహరించాలి
- కార్మికుల మృతి బాధాకరం
కరీంనగర్ డిపో-2కు చెందిన ఆర్టీసీ కార్మికుడు కరీంఖాన్ గుండె నొప్పితో చనిపోవడం తీరని ఆవేదన మిగిల్చిందన్నారు. గుండెనొప్పి రావడంతో నాలుగు రోజుల క్రితం ఆసుపతిల్రో చేరిన కరీంఖాన్ ఇవాళ ఉదయం కన్నుమూశాడు. ఈ పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం చూపి జరుగుతున్న మరణాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎంపీ అన్నారు.