టాలీవుడ్ సెలబ్రిటీల ఫిట్ నెస్ ట్రయినర్ అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ సెలబ్రిటీల ఫిట్ నెస్ ట్రయినర్ అరెస్ట్!

  • యూత్ ఫిట్ నెస్ క్లబ్ పేరిట మోసం
  • వార్షిక సభ్యత్వాలు ఇచ్చి సెంటర్ల మూసివేత
  • అరెస్ట్ చేసిన పోలీసులు
పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులకు ఫిట్ నెస్ ట్రయినర్ గా సేవలందిస్తున్న, యూత్ ఫిట్‌ నెస్ క్లబ్ యజమాని రిజ్వాన్ సయ్యద్‌ ను హైదరాబాద్ పోలీసులు ఓ చీటింగ్  కేసులో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, నగరంలో పలు ఫిట్ నెస్ శాఖలను ప్రారంభించిన సయ్యద్, వందలాది మందికి సభ్యత్వం ఇచ్చి, వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆపై వాటిల్లో చాలావరకూ మూసివేయడంతో, తమకు ముందుగా సమాచారం ఇవ్వకుండా జిమ్ సెంటర్లను మూసివేశారని, తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, పలువురు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

తమ నుంచి వార్షిక సభ్యత్వ రుసుము పేరిట ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల వరకూ వసూలు చేశారని చెప్పిన సుమారు 50 మంది బాధితులు, మొత్తం ఆరు లక్షలకు పైగా నష్టపోయామని ఫిర్యాదు చేశారు. దీంతో కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు, సయ్యద్ ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో ఈ నెల 6 వరకూ సయ్యద్ ను ప్రశ్నించనున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, తాము ఎవరినీ మోసం చేయలేదని, సెంటర్ ను మూసివేసే ముందు అందరి సెల్ ఫోన్లకూ మెసేజ్ లు పెట్టామని యూత్ ఫిట్ నెస్ క్లబ్ చెబుతుండటం గమనార్హం.
Youth Fitness Club
Fitness
Trainer
Arrest

More Telugu News