ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని చెప్పలేదా?: సీఎం కేసీఆర్ పై భట్టి విమర్శలు
- ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని హెచ్చరిక
- కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపణ
- మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారంటూ విమర్శలు
అడ్డంగా మాట్లాడడం ద్వారా కేసీఆర్ ఎంతో యుక్తిగా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని కేసీఆర్ చెప్పలేదా? అని భట్టి నిలదీశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులుపాల్జేసి, లాభాలతో నడుస్తున్న ఆర్టీసీని నష్టాల్లో ముంచేశారని విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో చోటుచేసుకున్న కార్మికుల హత్యలకు కేసీఆరే బాధ్యుడని అన్నారు.