ప్రేమించి పెళ్లాడిన భార్యను సరిగా చూసుకోలేకపోతున్నానని.. పుట్టిన రోజునాడే భర్త ఆత్మహత్య
- విజయనగరం జిల్లా సాలూరులో ఘటన
- ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన లారీ క్లీనర్
- కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపం
దీంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను సరిగా చూసుకోలేకపోతున్నానని, కుమార్తె కనీస అవసరాలు తీర్చలేకపోతున్నానని మనోవ్యధకు లోనయ్యాడు. గురువారం రాత్రి భార్య, కుమార్తెను తీసుకుని గ్రామంలో జరుగుతున్న సందెన్న ఉత్సవాలను చూసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ తర్వాత బళ్ల వేషాలు చూద్దాం రమ్మని భార్య బలవంతం చేసింది. తాను రానని పక్కింటి వారితో వెళ్లాలని చెప్పి వారిని పంపించాడు. అనంతరం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పుట్టిన రోజునాడే తనువు చాలించిన భర్తను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.