hayathnagar: అవును.. నేను బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా!: కీర్తి

షార్ట్స్‌లో చూడండి
తాను ఎవరి వల్ల అయితే గర్భం దాల్చిందో.. అతడినే పెళ్లి చేసుకుంటానని హయత్‌నగర్ తల్లి హత్యకేసు నిందితురాలు కీర్తి తెలిపింది. పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించిన కీర్తి.. తన పెళ్లికి సంబంధించి కూడా మాట్లాడింది. తాను గర్భం దాల్చడానికి కారణమైన బాల్‌రెడ్డినే పెళ్లాడతానని చెప్పుకొచ్చింది.

బాలికగా ఉన్నప్పుడే బాల్‌రెడ్డికి ఆకర్షితురాలైన కీర్తి.. అతడికి శారీరకంగా దగ్గరైంది. దీంతో గత సెప్టెంబరులో గర్భం దాల్చినట్టు అనుమానం కలిగింది. మెడికల్ షాపునకు వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని పరీక్ష చేసుకుంది. అందులో పాజిటివ్ అని తేలింది. ఆ సమయంలో బాల్‌రెడ్డి బెంగళూరులో ఉండడంతో ఏం చేయాలో కీర్తికి పాలుపోలేదు. తన ఇంటికి సమీపంలోనే ఉండే శశికుమార్ గుర్తొచ్చాడు. తాను అన్నయ్యా అని పిలిచే శశికుమార్ తనకు సాయం చేస్తాడని భావించి విషయం అతడికి చెప్పింది.

సానుకూలంగా స్పందించిన శశికుమార్ తన ఇంటికి ల్యాబ్ సిబ్బందిని పిలిపించి కీర్తికి పరీక్షలు చేయించాడు. ఈ పరీక్షల్లో ఆమెకు నాలుగో నెల అని తేలింది. ఈలోగా బాల్‌రెడ్డి హైదరాబాద్ రావడం, శశికుమార్ సాయంతో ఆమన్‌గల్ వెళ్లి పద్మ నర్సింగ్ హోంలో అబార్షన్ చేయించడం జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శశికుమార్.. బ్లాక్‌మెయిల్ చేసి కీర్తిని లొంగదీసుకున్నాడు.
Go Back to Shorts
hayathnagar
keerthi
balreddy
marriage
sashikumar

More Telugu News