హాలీవుడ్ నవ్వుల రేడు జాన్ విథర్‌స్పూన్ కన్నుమూత
- లాస్ఏంజెలెస్‌లో కన్నుమూసిన విథర్‌స్పూన్
- ఫ్రైడే చిత్రంలో ఐస్‌క్యూబ్‌కు తండ్రిగా గుర్తుండిపోయే పాత్ర
- తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్న ఐస్‌క్యూబ్
ఇప్పటివరకు ఫ్రైడే పేరుతో తెరకెక్కిన మూడు చిత్రాల్లోనూ విథర్‌స్పూన్ నటించడం విశేషం. ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో విథర్‌స్పూన్ నటించినప్పటికీ హాస్యప్రియులకు మాత్రం ఆయన ఐస్‌క్యూబ్ తండ్రిగానే పరిచయం. విథర్‌స్పూన్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐస్‌క్యూబ్ ట్వీట్ చేశాడు. విథర్‌స్పూన్‌కు భార్య ఏంజెలా, కుమారులు జేడీ, అలెగ్జాండర్ ఉన్నారు.