స్నేహితురాలిని కాపాడడం కోసం మొసలితో పోరాడిన బాలిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్నేహితురాలిని కాపాడడం కోసం మొసలితో పోరాడిన బాలిక!

  • జింబాబ్వేలో ఘటన
  • స్నేహితులతో చెరువులో ఈత కొట్టడానికెళ్లిన రెబెకా
  • స్నేహితురాలిని మొసలి లాక్కెళ్లడానికి యత్నించడంతో దానితో పోరాటం
మొసలితో పోరాడి, దాని కళ్లు పీకేసి తన స్నేహితురాలిని రక్షించుకుంది ఓ బాలిక. జింబాబ్వేలోని సిందెరేలా అనే గ్రామంలో రెబెకా ముంకోబ్వే అనే బాలిక తన స్నేహితులతో కలిసి సరదాగా చెరువు వద్దకు వెళ్లింది. స్నేహితురాళ్లంతా కలిసి అందులో ఈత కొడుతోన్న సమయంలో లయోటా మౌవానీ అనే బాలికను ఓ మొసలి లోపలికి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన రెబెకా మొసలితో పోరాడింది.
 
మొసలిపైకి ఎక్కి పిడిగుద్దులు కురిపించి, దాని కళ్లు పీకేసింది. దీంతో తీవ్ర నొప్పితో మొసలి లయోటాను వదిలి నీళ్లలోకి వెళ్లింది. లయోటాను తన వీపుపైన ఎక్కించుకుని చెరువులోంచి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి, ఆమె ప్రాణాలను కాపాడింది. లయోటాకు స్వల్పగాయాలు కావడంతో ఆమెను ఓ ఆసుపత్రికి తరలించారు. స్నేహితురాలిని కాపాడిన రెబెకాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
crocodile
zimbabwe

More Telugu News