అర్హత కలిగిన ఒక్కో దళిత కుటుంబానికి రూ. 30 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ ను కోరుదాం: తాటికొండ రాజయ్య
- ప్రస్తుతం భూముల రేట్లు పెరిగిపోయాయి
- ఎక్కడా భూములు దొరకడం లేదు
- ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారు
ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారని రాజయ్య అన్నారు. మాదిగల్లోని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంటే వారు పోరాటం చేయాలని చెప్పారు. మాదిగ ఉప కులానికి చెందిన కడియం శ్రీహరి 18 ఏళ్లు మంత్రిగా పని చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగల అభివృద్ధి కోసం మాదిగ సంఘాలు - మాదిగ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.