యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న పిన్నమ్మ... కేసు నమోదు!
- తరచూ పిన్ని ఇంటికి వచ్చి వెళ్లే యువతి
- నిద్రమత్తులో ఉన్న వేళ అసభ్య చిత్రాలు
- చూపించి బెదిరిస్తుంటే పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ఈ క్రమంలో దాదాపు నెల క్రితం మరోసారి ఆమె బుక్కాపురం రాగా, పిన్నమ్మ ఆమెకు మత్తు మందిచ్చింది. ఆ మత్తులో డాబాపై పడుకుని నిద్రిస్తున్న యువతి దగ్గరకు మరో వ్యక్తిని పంపింది. అతనితో సన్నిహితంగా ఉంటున్నట్టుగా ఫోటోలు తీయించింది. ఆపై ఆమెను డబ్బులకు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే, ఫొటోలు బయట పెడతానని బెదిరింపులకు దిగింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.