ఫలించని ప్రయత్నం.. బోరుబావిలో పడిన చిన్నారి సుజిత్ మృతి
- 25న బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి
- మూడు రోజులుగా సహాయక చర్యలు
- బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో చనిపోయాడని నిర్ధారణ
100 అడుగుల లోతులో బాలుడు చిక్కుకుపోయినట్టు గుర్తించిన అధికారులు రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. అయితే, బండరాళ్ల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. బాబుకు ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా సోమవారం బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించి సహాయక చర్యలు నిలిపివేశారు. సుజిత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.