Undavalli: కోడెల శివప్రసాద్ శత్రువుకు భయపడి సూసైడ్ చేసుకునేంత బలహీనుడు కాదు: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
- కోడెల అంత పిరికివాడు కాదు
- ఆయన ఇంట్లోనే బాంబులుండేవి
- దగ్గరి వాళ్లే తీవ్రంగా బాధించివుంటారు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దమ్మున్న నేతని, శత్రువుకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడని తాను భావించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కోడెల ఆత్మహత్యను గుర్తు చేసుకున్నారు. కోడెల అగ్రెస్సివ్ పొలిటిషన్ అని వ్యాఖ్యానించిన ఆయన, ఆయన ఇంట్లోనే బాంబులుండేవని, అవి ఓ సమయంలో పేలాయని, స్వయంగా పోలీసు స్టేషన్ పై కూడా తన అనుచరులతో కలిసి ఆయన దాడి చేసిన సందర్భాలున్నాయని అన్నారు.
అటువంటి వ్యక్తి, ఇప్పుడు జగన్ వంటి నాయకుడు ఇబ్బందులు పెడుతున్నాడనో, అరుణ్ కుమార్ తిట్టాడనో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే తాను నమ్మబోనని అన్నారు. శత్రువుతో తలపడే నైజమే కోడెలకు ఉందిగానీ, పిరికివాడి మాదిరిగా పారిపోయే రకం కాదని అన్నారు. ఎవరో దగ్గరి వాళ్ల నుంచి ఆయనకు తీవ్రమైన అవమానం ఎదురైవుండచ్చని దాంతోనే ఈ జీవితం వ్యర్థమని ఆయన అనుకొని ఉండవచ్చని ఉండవల్లి వ్యాఖ్యానించారు.