గుండె ఝల్లుమనే దృశ్యం... వంటింట్లో నాగుపాము!
- ఒడిశాలోని బారిపదలో ఘటన
- వంట చేసేందుకు వెళితే పడగ విప్పి ఆడుతున్న పాము
- చాకచక్యంగా బంధించిన వాలంటీర్
రోజు మాదిరిగానే వంట చేసేందుకు ఓ గృహిణి వంట గదిలోకి వెళ్లగా, పెద్ద నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. దీంతో తీవ్రంగా భయపడిన ఆమె, బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. దీంతో వారు పాములను పట్టుకునే వాలంటీర్ కు సమాచారాన్ని అందించగా, అతను వచ్చి, నాగుపామును చాకచక్యంగా బంధించాడు. దీన్ని సమీపంలోని అడవుల్లో వదిలేయనున్నట్టు తెలిపారు.