హోండా యాక్టివా కొన్నాడు... బస్తాల్లో డబ్బులు తెచ్చిచ్చాడు!
- మధ్యప్రదేశ్ లో టూ వీలర్ కొన్న రాకేశ్
- రూ. 5, రూ. 10 నాణాలను తెచ్చిచ్చిన వైనం
- లెక్కించేందుకు మూడు గంటలకు పైగా సమయం
బైక్ ఖరీదు రూ. 83 వేలు. ఇందులో వింతేమీ లేదు. కానీ, రాకేశ్ మాత్రం కేవలం రూ. 5, రూ. 10 నాణాలను బస్తాల్లో తీసుకెళ్లి, మొత్తం రూ. 83 వేలు చెల్లించడంతోనే షోరూమ్ నిర్వాహకులు అవాక్కయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించిన సిబ్బంది, వాటిని లెక్కగట్టారు. రాకేశ్ ఎన్నేళ్ల నుంచి వీటిని సేకరించి పెట్టుకున్నాడో తెలియదుగానీ, ఇప్పుడీ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.