ప్రదర్శనశాల నుంచి రూ.13 కోట్ల వజ్రాన్ని అలవోకగా కొట్టేశారు!
- జపాన్‌లోని యోకోహామాలో ఆభరణాల ప్రదర్శన
- పాల్గొన్న 410 ఆభరణాల సంస్థలు
- 50 క్యారెట్ల వజ్రాన్ని కొట్టేసిన చోరులు
గురువారం సాయంత్రం 5 గంటల వరకు కనువిందు చేసిన ఈ వజ్రం ఆ తర్వాత కాసేపటికే మాయమైంది. దీంతో ప్రదర్శనశాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటి వరకు కనిపించిన వజ్రం మాయం కావడం మిస్టరీగా మారింది. అత్యంత భద్రత ఉన్నా.. ఎలా మాయమైందో ఎవరికీ అంతుబట్టకుండా పోయింది. వజ్రం మాయమైన వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా ఫక్కీలో మాయమైన ఈ వజ్రాన్ని కాజేసిన వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.