జనాగ్రహం...బస్సుల్లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించిన ప్రయాణికులు
- ప్రభుత్వం, కార్మికుల తీరుపై ఆగ్రహం
- మలక్‌పేట, నల్గొండ క్రాస్‌రోడ్డు వద్ద ఘటన
- గంటల తరబడి బస్సుల్లేకపోవడంతో అసహనం
ఈరోజు పలువురు ప్రయాణికులు మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద బస్సుల కోసం వేచివున్నారు. గంటలు దాటిపోతున్నా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రయాణికులు కోపోద్రిక్తులయ్యారు. నడి రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను నిలిపి వేసి రాస్తారోకో నిర్వహించి తమ నిరసన, ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీల మొండి వైఖరి కారణంగా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు.