BCCI: రేపే బీసీసీఐ అధ్యక్ష పీఠంపైకి దాదా

  • 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలీ
  • దాదా రాకతో సీవోఏ పాలనకు ముగింపు
  • 10 నెలలపాటు పదవిలో కొనసాగనున్న గంగూలీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రేపు బాధ్యతలు చేపట్టునున్నారు. బుధవారం, ముంబైలో జరిగే బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో దాదా పగ్గాలు అందుకోనున్నారు. దీనితో 33 నెలలుగా బీసీసీఐ పాలన వ్యవహారాలను చూసిన సుప్రీంకోర్టు నియమించిన పాలన కమిటీ (సీవోఏ) హయాం ముగిసిపోతుంది.

 గంగూలీ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ఉపాధ్యక్షుడిగా ఉత్తరాఖండ్ కు చెందిన మహిం వర్మ, కార్యదర్శిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జయ్, కోశాధికారిగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ దుమాల్, సంయుక్త కార్యదర్శిగా కేరళకు చెందిన జయేష్ జార్జి బాధ్యతలు స్వీకరించనున్నారు.

More Telugu News