Benelli: రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా బెనెల్లీ కొత్త బైక్

షార్ట్స్‌లో చూడండి
దశాబ్దాల కాలంగా భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లకున్న ఆదరణ పెరుగుతోందే కానీ తగ్గడంలేదు. ముఖ్యంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోడల్ రాచఠీవికి నిదర్శనంలా పేరొందింది. అయితే ఇప్పుడు ఇటలీకి చెందిన బెనెల్లీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా సరికొత్త బైకును రంగంలోకి తీసుకువస్తోంది. ప్రీమియం సెగ్మెంట్లో వస్తున్న ఈ బైకు పేరు ఇంపీరియల్-400. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.69 లక్షలు. ప్రీబుకింగ్ సమయంలో రూ.4000 చెల్లించాలి. బెనెల్లి ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా బుకింగ్ లు జరుగుతాయి. బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన బెనెల్లి ఇంపీరియల్ 400 బైకు సాలిడ్ లుక్ తో ఇప్పటి యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంది.
Go Back to Shorts
Benelli
Royal Enfield

More Telugu News