తనయుడితో కలసి విక్రం భారీ మల్టీస్టారర్

ప్రస్తుతం విక్రమ్ రెండు భారీ సినిమాలతో బిజీగా వున్నాడు. ఆయన తనయుడు ధృవ్ హీరోగా చేసిన 'ఆదిత్యవర్మ' వచ్చేనెల 8వ తేదీన విడుదల కానుంది. 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా, నిన్న చెన్నైలో ఆడియో వేడుక జరుపుకుంది. ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేశ్ మెహతా నిర్మించిన ఈ సినిమాలో బనిత సంధు కథానాయికగా కనిపించనుంది.

నిన్న జరిగిన 'ఆదిత్యవర్మ' ఆడియో వేడుకలో నిర్మాత ముఖేశ్ మెహతా ఒక ప్రకటన చేశారు. తమ బ్యానర్లో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ మూవీ ఉంటుందనీ, 2021- 22 మధ్య ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్పారు. దాంతో విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ధృవ్ ఫస్టు మూవీగా వస్తోన్న 'ఆదిత్య వర్మ' భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు.
Go Back to Shorts
Vikram
Dhruv
Banitha sandhu

More Telugu News