సాయంత్రం మరోసారి తమిళిసైని కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు
- సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తో భేటీ
- రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్న నేతలు
- కోర్టు తీర్పును కూడా పట్టించుకోవడం లేదని మండిపాటు
ఈ సందర్భంగా జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఆపబోమని చెప్పారు.