Devineni Uma: పెండింగ్ బిల్లులు ఎవరికి ఇచ్చారో చెప్పే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?: దేవినేని ఉమ సవాల్

షార్ట్స్‌లో చూడండి
ఇంట్లో కూర్చుని సీఎం జగన్ నాటకాలు ఆడుతూ, రియాల్టీ షోలు చూపిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. అనేక ప్రాజెక్టులకు చెందిన పెండింగ్ బిల్లులు రూ.5228 కోట్ల వరకు సీఎం జగన్ చేతిలో ఉన్నాయని, ఈ నాలుగున్నర నెలల్లో ఎవరికి బిల్లులు చెల్లించారో చెప్పగలరా అని ఉమ ఏపీ సర్కారును నిలదీశారు. ప్రధాన ప్రాజెక్టుల్లో రూ.3859 కోట్లు, చిన్ననీటిపారుదల విభాగంలో నీరు-చెట్టు బిల్లులు రూ.1468 కోట్ల వరకు ఉన్నాయని, ఆ  బిల్లులు ఎవరెవరికి ఇచ్చారో చెప్పే దమ్ము, ధైర్యం ఏపీ ఆర్థికమంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ ఉందా? అంటూ సవాల్ విసిరారు.
Go Back to Shorts
Devineni Uma
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News