సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదు... కేసీఆర్ పై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఫైర్
- ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి స్పందన
- ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప మేధావా? అంటూ వ్యాఖ్యలు
- 1994 సంక్షోభం మళ్లీ తప్పదని వెల్లడి
కొందరు మంత్రులు ఆర్టీసీ కార్మికులపై విమర్శలు చేసి, ఆపై ఇంటికి వెళ్లి రోదిస్తున్నారని అశ్వత్థామరెడ్డి వివరించారు. ఆర్టీసీ సమ్మెపై మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకుంటే మాత్రం 1994 సంక్షోభం పునరావృతమవుతుందని, కేసీఆర్ ఆ విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఈటల తదితర మంత్రులు ఇప్పటికైనా ఆర్టీసీ సమ్మెపై మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.