మద్యం మత్తులో యువకుల అరాచకం.. స్నేహితుడి కుమార్తెపై అఘాయిత్యం
- మిఠాయిలు కొనిస్తామంటూ బయటకు తీసుకెళ్లి అత్యాచారం
- కత్తితో స్నేహితుడిని నరికి చంపిన బాలిక తండ్రి
- తప్పించుకున్న మరో నిందితుడు
గోపాలపురానికి చెందిన ఓ యువకుడు తన మిత్రులైన కార్తి (24), మురుగన్‌లతో కలిసి మద్యం తాగాడు. అనంతరం వారిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో మిత్రుడి ఐదేళ్ల కుమార్తెను చూసిన కార్తి, మురుగన్‌లు మిఠాయిలు కొనిస్తామంటూ చిన్నారిని బయటకు తీసుకెళ్లారు. అలా వెళ్లినవారు రెండు గంటలు గడిచినా రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలిక తండ్రి వెతుక్కుంటూ బయలుదేరాడు.
ఈ క్రమంలో ఓ చోట బాలిక ఏడుస్తూ కనిపించింది. విషయం ఆరా తీయగా, కుమార్తె చెప్పింది విని ఆగ్రహంతో ఊగిపోయాడు. కార్తిని పట్టుకుని కత్తితో నరికి చంపాడు. మరో మిత్రుడు మురుగన్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.