Tngo: టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్టీసీ జేఏసీ భేటీ

  • కార్మికుల సమ్మెపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాం
  • ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరాం
  • ప్రభుత్వంతో చర్చించేందుకు కారెం రవీందర్ రెడ్డిని పంపాలని నిర్ణయించాం

కాస్సేపటి సేపటి క్రితం టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతలను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం, నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, కార్మికుల సమ్మెపై రెండు సంఘాల నేతలతో చర్చించినట్టు చెప్పారు. సమ్మెపై ప్రభుత్వంతో చర్చించేందుకు టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డిని పంపాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని, రూ.1400 కోట్ల పీఎఫ్ డబ్బును కూడా ప్రభుత్వం వాడుకుందని ఆయన ఆరోపించారు. స్వరాష్ట్రంలో సమ్మె చేయాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని అన్నారు. ఏడు వేల మంది రిటైర్ అయినా వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదని విమర్శించారు. బినామీలకు ఆర్టీసీ ఆస్తులు అమ్మేస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నేతలు ఈరోజు విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెంచామని చెప్పారు.

More Telugu News